- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా భూములు కబ్జా చేశారు.. న్యాయం చేయండి
దిశ, నల్గొండ : ‘మా భూములను కబ్జా చేశారు సారు.. మాకు న్యాయం చేయండి’ అంటూ ఓ రైతు కుటుంబం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మను వేడుకుంది. ఏకంగా నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేశారని, న్యాయ పరంగా విచారణ నిర్వహించి తమ భూమి ఇప్పించాలని అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన బాధిత రైతు దేప వెంకట్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. అదే గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 153లో తమ కుటుంబం పేరుపై 8.6 ఎకరాల పట్టాభూమి ఉందని, అందులో ఏకంగా 4.6 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు.
మండల సర్వేయర్‌తో భూమిని కొలిపించగా, పట్టాభూమిలో ఉన్నదాని కంటే 4.6 ఎకరాలు భూమి తక్కువ ఉండి ఇతర వ్యక్తుల భూమిలో తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వివాదానికి సంబంధించిన ఫైల్ నార్కట్ పల్లి తహసీల్దార్ ఆఫీసులో ఉందని, న్యాయపరంగా తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యాయపరంగా విచారణ నిర్వహించాలని కోరారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరుగలేదని కబ్జా చేసిన వ్యక్తులు తమ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు అందించిన వారిలో దేప ప్రమీల, బుచ్చిరెడ్డి, అండాలు, శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.