- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలి: కలెక్టర్
దిశ, ములుగు: కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌కు సంబంధించి కాల్వల భూసేకరణ ను పది రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు అతిథి గృహంలో కొండ పోచమ్మ సాగర్ కాల్వల భూసేకరణ పై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కాల్వల భూసేకరణ, నిర్మాణం పై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే జిల్లాలో ప్రధాన జలాశయాల నిర్మాణం పూర్తయినందున కాల్వల భూసేకరణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూ సేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జలాశయాల నుండి పంట చేలకు సాగు నీరు చేరేందుకు పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మైనర్ కెనాల్స్ నిర్మాణం తప్పనిసరి అన్నారు. వీటి నిర్మాణం పూర్తైతేనే రైతులు వేసవిలో సైతం సాగు నీరు అందించ వచ్చాన్నారు. ఇప్పటికే సింహ భాగం భూ సేకరణ పూర్తి అయినందున అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తి చేసి, కాల్వల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే చెక్కులు ఇచ్చిన చోట పనులు వేగంగా చేపట్టాలన్నారు. వచ్చే 15 వ తేదీ తర్వాత తిరిగి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని అప్పటికల్లా పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలన్నారు.
అంతకుముందు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి సరిహద్దు గ్రామాలైన విఠలాపురం- దాచారం గ్రామాల రైతుల భూ సమస్యలపై సర్వే , ల్యాండ్ రికార్డ్ అధికారులతో సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి సమస్యను పునరావృతం కాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో చెన్నయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి అనంత రెడ్డి, కొండపోచమ్మ సాగర్ పర్యవేక్షక ఇంజినీర్ వేణు, ఉప కార్యనిర్వహక ఇంజనీర్లు, తాసిల్దార్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.