లక్ష్మీపురం బీట్ ఆఫీసర్ చందర్ సస్పెండ్..?

by Shyam |
Suspended1
X

దిశ: బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఫారెస్టు రేంజ్ పరిధి లక్ష్మిపురం బీట్ ఆఫీసర్ చందర్‌పై ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విధుల పట్ల అలసత్వంతో శాఖ పరమైన చర్యలలో భాగంగా అతనిని ఫారెస్టు డీఎఫ్‌ఓ సస్పెండ్ చేసినట్లు సమాచారం. గత నాలుగు రోజుల క్రితం ఫారెస్టు రేంజ్ అధికారి సువర్చల చందర్ బీట్‌లో ఫారెస్టు 5 హెక్టార్లు ఎన్ క్రోచ్‌కు గురిఅయినట్లు గుర్తించారు. ఈ అవతవకలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిసింది. దీనితో లక్ష్మీపురం బీట్ ఆఫీసర్ చందర్‌ను ఈ నెల 13న సస్పెండ్ ఉత్తర్వులు అందచేసినట్లు సమాచారం.

Advertisement
Next Story

Most Viewed