లగిశెట్టి నిజాయితీ

by Shyam |
లగిశెట్టి నిజాయితీ
X

దిశ, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నేత లగిశెట్టి సాయిప్రసాద్ తనకు దొరికిన రూ.10వేలను, పోగొట్టుకున్న అలీమ్‌కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. వనపర్తికి చెందిన అలీమ్ బైక్‌పై వెళ్తుండగా ఆయన దగ్గరున్న రూ.10వేలు పోయినట్టు స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ విషయం తెలిసిన సాయిప్రసాద్ తనకు దొరికిన డబ్బును డీఎస్పీ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అలీమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్‌ను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ సూర్యనాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags : lagishetty, honesty, arya vysya sangam president, wanaparthy

Advertisement

Next Story

Most Viewed