- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీయూలో తమిళ్ డైరెక్టర్.. ఆందోళన చెందుతున్న అభిమానులు
దిశ, సినిమా : సౌత్ స్టార్ విజయ్ సేతుపతి అప్‌కమింగ్ ఫిల్మ్ ‘లాభం’ డైరెక్టర్ ఎస్‌పీ జననాధన్ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లోనే స్పృహ తప్పి కింద పడిపోయిన జననాధన్‌ను తన అసిస్టెంట్స్ హాస్పిటల్‌కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తనకు ఇంకా మెడికల్ టెస్టులు జరుగుతున్నాయని కుటుంబీకులు తెలిపారు.
నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఎస్‌పీ జననాధన్.. ప్రస్తుతం తన ఆఫీస్‌లో ‘లాభం’ సినిమా ఎడిటింగ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పనికి బ్రేక్ ఇస్తూ లంచ్ కోసం ఇంటికి వెళ్లిన ఆయన.. ఎంతసేపటికీ ఆఫీస్‌కు తిరిగి రాకపోయేసరికి చెక్ చేసేందుకు ఇంటికి వెళ్లారట అసిస్టెంట్స్. ఆయన నేలపై పడిపోయి ఉండటాన్ని గమనించి వెంటనే హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.
‘లాభం’ మూవీ సేతుపతి – జననాధన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కాగా.. 2015లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘పురంపొక్కు ఎంగిర పోధువుదమై’ సూపర్ హిట్ అయింది.