మొదటి బిడ్డ సీక్రెట్.. రెండో బిడ్డ పబ్లిక్ అంటున్న నటి..

by Shyam |   ( Updated:2021-09-08 04:16:16.0  )
మొదటి బిడ్డ సీక్రెట్.. రెండో బిడ్డ పబ్లిక్ అంటున్న నటి..
X

దిశ, సినిమా : అమెరికన్ మోడల్, రియాలిటీ టెలివిజన్ స్టార్ కైలీ జెన్నర్.. తన సెకండ్ ప్రెగ్నెన్సీని కన్‌ఫర్మ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో 265 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ఈ సెలబ్రిటీ ఉమన్.. వైట్ హార్ట్, ప్రెగ్నెంట్ ఉమన్ ఎమోజీలతో పోస్టు చేసిన వీడియోను తన బాయ్ ఫ్రెండ్ ట్రావిస్‌కు ట్యాగ్ చేసింది. వీరిద్దరికీ ఇదివరకే 3 ఏళ్ల పాప స్టార్మీ వెబ్‌స్టర్ ఉండగా, ఇప్పుడు మరో బిడ్డను కనేందుకు ఎదురుచూస్తున్నట్లు ఈ 90 సెకన్ల వీడియోలో తెలిపింది. ముందుగా పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ రిజల్ట్‌ను చూపిస్తూ స్టార్ట్ అయిన వీడియోలో అల్ట్రాసౌండ్ కోసం డాక్టర్‌ను సంప్రదించడం దగ్గరి నుంచి ఆగస్టులో కైలీ బర్త్‌డే సెలబ్రేషన్స్ వరకు క్యాప్చర్ చేశారు. ఫైనల్‌గా కైలీ కూతురు స్టార్మీ.. తల్లి బేబీ బంప్‌ను ముద్దు పెట్టుకోవడాన్ని రికార్డు చేశారు.

https://www.instagram.com/tv/CTieyGYpYdi/?utm_source=ig_embed&ig_rid=1854ca12-267e-49a3-9ce6-f54a05c97aa0

కైలీ ప్రెగ్నెంట్ అనే విషయం ఆగస్టులోనే బయటకు తెలిసినా.. తాజాగా ఇన్‌స్ట్రామ్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది. మరో ఫేమస్ మోడల్ కిమ్ కర్దాషియన్‌ సోదరి అయిన కైలీ.. తన ఫస్ట్ ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచింది. స్టార్మీ పుట్టిన కొన్ని రోజుల తర్వాత పబ్లిక్‌గా అనౌన్స్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed