- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర’
రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కుంతియా ఆరోపించారు. దీంతో 72 ఏళ్లుగా రిజర్వేషన్లు పొందుతున్న ఆయా వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్గాలు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలు చేయాలని సూచించారు. దేశంలో నిరక్షరాస్యత , పేదరికం, సామాజిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు.. విద్యా, ఉద్యోగం, పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించందన్నారు. కాగా, బీజేపీ చాల కాలంగా రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోందని కుంతియా తెలిపారు. అలాగే రిజర్వేషన్ల అమలు రాష్ట్రాలకే పరిమితం చేయడంతో.. బీజేపీ తన వంతు బాధ్యతల నుంచి తప్పుకుంటోందని విమర్శించారు. రిజర్వేషన్ల అంశంపై.. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల తీర్పు విషయంలో.. రివ్యూ పిటిషన్ వేయకుండా దానిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాలు వెతుకుతుందన్నారు. ఇది జరిగితే బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర నష్టం కలుగుతుందని కుంతియా చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేయాలన్నారు. ఈనెల 16వ తేదిన హైదరాబాద్‌లో ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ప్రతి పౌరుడు పాల్గొనాలని కుంతియా పిలుపునిచ్చారు.