అంబేడ్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయం : మంత్రి కేటీఆర్

by Shyam |
అంబేడ్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనీయం : మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేడ్కర్ వర్దంతి సందర్భంగా సోమవారం ఆయన పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి భవన్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్వతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారతదేశ భవిష్యత్తుకు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారని కొనియాడారు. అంబేడ్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయం అన్నారు.

ఆయన ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినదని అన్నారు . ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేడ్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని కేటీఆర్ తెలిపారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆనంద్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story