- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టభద్రుల ఓట్ల కోసం కేటీఆర్ ఫోన్.. వైరలైన కాల్ రికార్డు
దిశ ప్రతినిధి, మేడ్చల్ : వరస వైఫల్యాలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జరిగేది పట్టభద్రుల ఎన్నికలే అయినా.. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని నిర్వహించాయి. శుక్రవారం సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో తదుపరి కార్యకలాపాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ నేరుగా బూత్ ఇన్ చార్జీలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. మీ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. మన పార్టీపైన గ్రాడ్యుయేట్లు ఎలా స్పందిస్తున్నారని తెలుసుకుంటున్నారు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎక్కడ పనిచేస్తున్నారు.. ఏ బూత్ పరిధిలో తిరుగుతున్నారు.. మీరు ఎన్ని ఓట్లకు ఇన్ చార్జీగా వ్యవహారిస్తున్నారు.. అక్కడ మన పార్టీకి ఎంత మంది పాజిటివ్ గా ఉన్నారు.. మీరు ఎంత మందిని కలిశారు.. వారు ఏమంటున్నారు అనే విషయాలపై ఆయన ఆయా నేతలను ఆరా తీశారు. ఈ క్రమంలోనే బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్ కు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి ఆడియో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో మంత్రి కేటీఆర్, ఛైర్మన్ శ్రీనివాస్ ల సంభాషణ ఇలా ఉంది..
మంత్రి కేటీఆర్: హాలో శ్రీనివాస్ గారు.. ఎలా ఉన్నారు.. బాగున్నారా..?
మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ : జై తెలంగాణ.. బాగున్నా.. సార్, మీరు ఎలా ఉన్నారు.
మంత్రి: బాగున్నాను.. శ్రీనివాస్ గారు మీరు ఏ వార్డులో పనిచేస్తున్నారు..?
ఛైర్మన్ : సార్ నేను బోయిన్ పల్లిలోని బూత్ నెంబర్ 448లో పనిచేస్తున్నాను. అందులో 1890 ఓట్లు ఉన్నాయి..
మంత్రి: మీరు ఎన్ని ఓట్లుకు ఇన్ చార్జీగా ఉన్నారు.?
ఛైర్మన్ : సార్.. నేను 103 ఓట్లకు ఇన్ చార్జీగా ఉన్నాను. అందులో 43 ఓట్లు సరౌండింగ్ ప్లేస్ లో ఉన్నారు. మిగితా వారు సమీప ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ 103 మంది ఓటర్లలో 99 మందిని గుర్తించి, వారిని మూడు సార్లు కలిశాను. ఒక్కసారి మా ఎమ్మెల్యే సాయన్న, ఎన్నికల ఇన్ చార్జీ రసమయి బాలకిషన్ లతో వారిని వెళ్లి కలిశాం. అంతా కూడా పాజిటివ్ గానే ఉంది. 90 ఓట్లలో 75 ఓట్ల వరకు మన పార్టీకి పడుతాయి. పోలింగ్ రోజున ఎమ్మెల్యే సహకారంతో ఓటర్లకు వెహికిల్స్ కూడా అరెంజ్ చేశాం. వారిని ఇంటి నుంచి తీసుకువెళ్లి ఓటు వేయించి, తిరిగి ఇంటి దగ్గర దిగబెడుతామని చెప్పాం. అందరు సానుకూలంగానే స్పందించారు సార్.. అని కేటీఆర్ కు మార్కెట్ ఛైర్మన్ వివరించారు. ఇంతలోనే శ్రీనివాస్ తాను బోయిన్ పల్లి కమిటీ ఛైర్మన్ అని పరిచయం చేసుకోగా, ఓ వెరీగుడ్ శ్రీనివాస్.. మీ మార్కెట్ గురించి ప్రధానితో మాట్లాడించే ప్రయత్నం చేయించినందుకు ఛైర్మన్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.