కేటీఆర్ డాక్యుమెంటరీ ఆవిష్కరణ

by Shyam |
KTR Birthday
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో కేటీఆర్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించారు. ఆ డాక్యుమెంటరీని శుక్రవారం తెలంగాణ భవన్ లో మంత్రి గుంటకండ్ల జదీష్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ గుప్తా, రాష్ట్ర నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఎన్.శంకర్, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, గుజ్జ యుగేందర్ రావు, దూదిమెట్ల బాల్ రాజు యాదవ్, రంజిత్, జెల్లా శంకర్, టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు

“కదిలే కదిలే…” ప్రత్యేక గీతం ఆవిష్కరణ

ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన “కదిలే కదిలే…” ప్రత్యేక గీతాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ప్రత్యేక గీతాన్ని రూపొందించిన దూలం సత్యనారాయణ, సంగీత దర్శకుడు కార్తిక్ కొడకండ్ల, గీత రచయిత వీరు గడ్డం, బృందాన్ని ఎంపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed