‘షారుక్ చేసేది 95శాతం డూపేనా..?’

by Shyam |
‘షారుక్ చేసేది 95శాతం డూపేనా..?’
X

దిశ, సినిమా : బాలీవుడ్ రివ్యూ రైటర్ కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే).. షారుక్ ఖాన్‌పై సెటైర్ వేశాడు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో పోల్చుతూ విమర్శించాడు. షారుక్ హైట్, వెయిట్, ఏజ్ మెన్షన్ చేసిన కేఆర్‌కే.. 56 ఏళ్ల వయసులో ఇలాంటి స్టంట్స్ చేయాలంటే 95శాతం డూప్‌ను ఉపయోగించాల్సి వస్తుందని కామెంట్ చేశాడు. అయినా సరే షారుక్ ఇప్పటికీ యాక్షన్ ఫిల్మ్స్ ఎంచుకుంటున్నాడని ట్వీట్ చేశాడు. ఇది తప్పా కాదా? అని ప్రశ్నించిన ఆయన.. షారుక్ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ చేస్తున్నదేంటని అడిగాడు. ఈ ట్వీట్‌పై ఫైర్ అవుతున్న షారుక్ అభిమానులు.. డాన్ 2, రాయిస్ సినిమాల్లో షారుక్ స్వయంగా స్టంట్స్ చేశాడని, డూప్‌ను ఉపయోగించలేదని క్లారిటీ ఇచ్చారు. హైట్, వెయిట్ మెన్షన్ చేస్తున్నప్పుడు స్టామినా గురించి కూడా ఆలోచించాలన్న ఫ్యాన్స్.. ఇలాంటి సెటైర్ వేస్తే బాగోదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story