జూరాలకు పరుగులెడుతున్న కృష్ణమ్మ.. 

by Shyam |
జూరాలకు పరుగులెడుతున్న కృష్ణమ్మ.. 
X

దిశ, మహబూబ్ నగర్ : నారాయణ్ పూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాల వైపు కృష్ణమ్మ బిరబిర పరుగులు తీస్తోంది. కర్ణాటకలోని నారాయణ్ పూర్ డ్యాం నుంచి కృష్ణానది నీటిని ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. రెండుగేట్లను ఒక మీటర్ పైకెత్తి 11,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణా జలాలు జూరాల వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులను నింపి తెలంగాణలోని ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి. ఆల్మట్టి జలశయానికి ఎగువ నుంచి 69వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, విద్యుదుత్పత్తి ద్వారా దిగువ నదిలోకి 36,130 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టికి దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్​ ప్రాజెక్టు జలాశయం 37.64 టీఎంసీల సామర్థ్యం కాగా, ఆదివారం ఉదయం వరకే అది నిండింది. దీంతో నారాయణపూర్​ ప్రాజెక్టులో రెండు స్పిల్ ​వే గేట్లను ఎత్తి దిగువ నదిలోకి 11వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో విడుదలైన కృష్ణానది వరద జూరాల ప్రాజెక్టు జలాశయానికి మరో రెండు రోజుల్లో చేరుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed