- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణుడి బేబీగా.. ‘రుక్సార్’
శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు ఒకటా రెండా.. మహాభారతమంతా ఆయన లీలలే. ప్రేమాయణాలు నడపడంలో కృష్ణ భగవానుడి తరువాతే ఎవరైనా. అటు సత్యభామ, రుక్మిణితో పాటు ఇటు రాధతోనూ ఆయన ప్రేమమధురిమలను వర్ణించడం సాధ్యం కాదు. అయితే టాలీవుడ్‌లో ఈ నేపథ్యంలోనే వస్తున్న సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఇప్పటికే టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి.. చిత్రంలోని ప‍్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేస్తూ ‘కృష్ణ ఫస్ట్ లవ్ సత్య’.. ‘రాధ ది అదర్ హాఫ్ ఆఫ్ ద కృష్ణ’ క్యాప్షన్‌తో వీడియోలు షేర్ చేశారు. ఫస్ట్ లవ్‌లో సత్యగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌తో రొమాన్స్ చేసిన కృష్ణ, సెకండ్ లవ్‌లో రాధగా నటించిన శాలినీతో ప్రేమసుధలు కురిపించాడు. ఈ టీజర్లు చిత్రంపై ఆసక్తిని పెంచగా.. తాజాగా కృష్ణ బేబ్స్ ‘రుక్సార్’ వచ్చేసింది.
రెండు టీజర్లలో ఇద్దరు హీరోయిన్లను పరిచయం చేసిన చిత్రం బృందం.. మూడో టీజర్‌లో రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్‌ను ‘రుక్సార్’గా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ‘సో.. రుక్సార్ అనే పేరున్న అమ్మాయి ఇలా ఉంటుదన్నమాట.. ఫుల్ క్లారిటీ.. కర్లీ హెయిర్.. బట్ స్టిల్ సింగిల్’ అని సిద్ధు డైలాగ్ చెప్పగా.. ‘నాతో ప్రేమలో పడొద్దు’ అంటూ సీరత్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఈ చిత్రాన్ని బల్లాలదేవుడు రానా సమర్పిస్తుండటం విశేషం. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఓటీటీ ద్వారా ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది.