పవన్ అభిమానులకు క్రిష్ చాలెంజ్

by Jakkula Samataha |   ( Updated:2020-04-24 02:55:00.0  )
పవన్ అభిమానులకు క్రిష్ చాలెంజ్
X

#BetheREALMAN చాలెంజ్ ట్రెండింగ్ లో ఉంది. సందీప్ వంగా స్టార్ట్ చేసిన చాలెంజ్… ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఈ చాలెంజ్ లో భాగంగా ఎం ఎం కీరవాణి నామినేట్ చేసిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి … టాస్క్ పూర్తి చేసి వీడియో అప్ లోడ్ చేశారు. మొక్కలకు నీళ్లు పట్టి … ఇళ్లు శుభ్రం చేసిన క్రిష్…. తల్లికి కమ్మనైన వంట చేసి పెట్టాడు. అయితే ఈ దర్శకుడు ఏ హీరోలకో… దర్శకులలో… లేదంటే సినీ సెలబ్రిటీస్ కో కాకుండా సాధారణ వ్యక్తులకు చాలెంజ్ విసిరాడు. ప్రపంచంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ #betheREALMAN చాలెంజ్ విసిరాడు. తద్వారా… సాధారణ ప్రజలకు కూడా ఈ సవాల్ విసురుతూ… ప్రతి ఒక్కరూ ఇంట్లో మహిళలకు సహాయం చేయాలని కోరాడు.

కాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాబిన్ హుడ్ లాంటి పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమా ద్వారా తొలిసారి ఎంఎం కీరవాణి పవన్ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు.

Tags : Director,Krish Jagarlamudi, MM Keeravani, Sandeep Vanga, betheREALMAN, Challenge, Sandeep Vanga

Advertisement

Next Story

Most Viewed