- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంక్రాంతికి ‘క్రాక్’ పోలీస్

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం గురించి అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. టాకీ పార్ట్ పూర్తయిపోయిందని, సాంగ్ చిత్రీకరణ ఒక్కటే మిగిలి ఉందన్న యూనిట్.. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. శృతి హాసన్ రవితేజతో జోడీ కడుతున్న సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. మరోసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న మాస్ రాజా డైలాగ్, లుక్ సినిమాపై హోప్స్ పెంచగా.. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న రవితేజ ఈ సినిమాతో కమింగ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.
https://twitter.com/TheKrackMovie/status/1326462801737445376?s=20
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాకు ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తుండగా.. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ హైలెట్ కానుందని టాక్. కాగా దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.