- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
16 శాతం వృద్ధి సాధించిన కోటక్ బ్యాంక్
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 1,853.5 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం వృద్ధి అని బ్యాంకు తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ. 4,007 కోట్లకు చేరుకుందని, అదేవిధంగా డిసెంబర్ నాటికి స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 3.27 శాతంగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో బ్యాంకు 4.5 శాతంతో వరుస త్రైమాసిక వృద్ధిని సాధించిందని, ఇది ఇప్పటివరకు ఆదాయలను వెల్లడించిన బ్యాంకుల కంటే మెరుగైనదని బ్యాంకు పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం 29 శాతం పెరిగి రూ. 3,083 కోట్లకు చేరుకుందని ఎక్స్ఛేంజె ఫైలింగ్‌లో వెల్లడించింది.
Advertisement
Next Story