- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నిక ఎఫెక్ట్.. పోలీసుల కంట్రోల్‌లో కొండపల్లి
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో మొత్తం 750 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా వారిలో 400 మంది పోలీసులు మున్సిపల్ ఆఫీసు దగ్గరే గస్తీలో ఉన్నారు. ఎన్నిక సందర్భంగా కొండపల్లిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న కారణంగా టీడీపీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి కె. శ్రీలక్ష్మి, ఎంపీ కేశినేని నాని..హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ అయిపోయేంత వరకు పోలీస్ భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ జి.పాలరాజును హైకోర్టు ఆదేశించింది. కాగా, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించినా ఫలితాలను ప్రకటించకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేశినేని నాని ఓటు హక్కు వినియోగం తామిచ్చే తీర్పుకు లోబడే ఉండాలని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అక్కడ భారీగా సెక్యూరిటీని పెంచారు.