అంజన్నకు కరోనా ఎఫెక్ట్.. కొండగట్టులో ఆర్జిత సేవలు బంద్..

by Sridhar Babu |
అంజన్నకు కరోనా ఎఫెక్ట్.. కొండగట్టులో ఆర్జిత సేవలు బంద్..
X

దిశ,జగిత్యాల: కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తున్న కారణంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కరోనా దృష్యా ఆలయంలో అభిషేకాలు, వ్రతాలు, వాహనపూజలతో పాటు దీక్షాపరులకు మాలధారణ, విరమణ చేయలేమని అర్చకులు తెలపడంతో ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తలనీలాలు తీయడానికి నాయీబ్రాహ్మణులు కూడా విముఖత చూపడం వల్ల కళ్యాణకట్టలో కేశఖండన రద్దు చేస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనలననుసరించి ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సాధారణ దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed