‘రాష్ట్రం శ్మశానాల తెలంగాణ‌గా మారుతుంది’

by Sridhar Babu |
‘రాష్ట్రం శ్మశానాల తెలంగాణ‌గా మారుతుంది’
X

దిశ, భువనగిరి: నిత్యం ఆరోగ్యశాఖ అధికారుల‌కు అందుబాటులో ఉండే ఈటల‌ను తొల‌గించ‌డం దారుణ‌మ‌ని, టీఆర్ఎస్ పార్టీకి ఓన‌ర్లం అన్న మాట‌ల‌కే ఈటెల‌పై కేసీఆర్ క‌క్ష క‌ట్టార‌ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఇరవై నాలుగు గంటలు ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్ చేతిలో వైద్య, ఆరోగ్య శాఖ ఉంటే వైద్యం భ్రష్టు పట్టి పోతుందని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ క‌రోనాతో ప్రజ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లర రాజ‌కీయాలు చేస్తుందన్నారు. కరోనా మహమ్మారి అదుపు తప్పే ప్రమాద ముందని, భేషజాలు మాని 24గంటల్లో వైద్య, ఆరోగ్య శాఖకు కొత్త మంత్రిని నియమించి కరోనా రక్కసినుంచి ప్రజలను కాపాడాలన్నారు.

కరోనా విజృంభనతో మరణాలు పెరిగి శ్మశానాల తెలంగాణగా మారుతుంటే, ఫామ్‌హౌస్ నుంచి బయటికి రాని సీఎం ‘మేం బయటినుంచి టీఆర్‌ఎస్‌లోకి రాలేదని, టీఆర్ఎస్ ఓనర్లమన్న’ పాపానికి ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. గతంలో వేలాది ఎకరాల ఆస్సైన్ భూములు కబ్జా చేసిన అధికారపార్టీ నేతలపై చర్యలేవి అని ప్రశ్నించారు. ఈటెల‌పై కోపంతో దేవ‌ర‌యాంజ‌ల్ రైతుల‌కు అన్యాయం చేస్తే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. ఫార్మా సిటీ పేరుతో రాచ‌కొండ ప్రాంతంలో ప్రభుత్వం 19వేల ఎక‌రాల‌ను ప్రైవేట్ కంపెనీల‌కు ధార‌ధ‌త్తం చేయ‌లేదాన్నారు.

Advertisement

Next Story

Most Viewed