హోమ్ క్వారంటైన్‌లో కోహ్లీ, అనుష్క !

by Shamantha N |
హోమ్ క్వారంటైన్‌లో కోహ్లీ, అనుష్క !
X

కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరు కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం)లో ఉండాలని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. తన భార్య అనుష్క శర్మ క్వారంటైన్‌పై ఒక వీడియో రూపొందించి ట్విట్టర్‌లో పోస్టు చేయగా కోహ్లీ దాన్ని రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం మానవాళి అంతా విపత్కర పరిస్థితుల్లో ఉందని.. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కోహ్లీ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం మేమిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధం చేసుకున్నాం.. వీలైతే మీరందరూ ఇలాగే ఇండ్లల్లో ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వైరస్‌ వ్యాప్తిని నివారించాలని’ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22న పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు కోహ్లీ మద్దతు తెలిపాడు.

Tags : Home quarantine, Kohli, Anushka, Modi, Janata Karfu

Advertisement

Next Story

Most Viewed