సింహ వాహనంపై రామచంద్రమూర్తి తేజోవిలాసం

by srinivas |
Thirupathi
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన సోమవారం సింహ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై రాములవారు కనువిందు చేయనున్నారు. ఈ వేడుకల్లో పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్‌ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం‌, జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed