- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంజాబ్‌ను వీడనున్న కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ జట్టును వీడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2022లో జట్టులో ఉండబోవడం లేదని పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి కేఎల్ రాహుల్ సమాచారం ఇచ్చినట్లు ‘క్రిక్‌బజ్’ అనే క్రీడా వెబ్‌సైట్ ఒక కథనంలో పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. దీంతో ఫామ్‌లో ఉన్న ఇండియన్ క్రికెటర్లకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇప్పటికే ఉన్న పలు జట్లు కేఎల్ రాహుల్‌ను సంప్రదించినట్లు కూడా సమాచారం.
తన సొంత రాష్ట్రంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్నది. దీంతో అతడు మరిన్ని మంచి అవకాశాల కోసమే తనను రిలీజ్ చేయమని పంజాబ్ కింగ్స్‌ను కోరడంతో యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. కేఎల్ రాహుల్ 2018 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. 2020, 2021 సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లలో పంజాబ్ పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంతో సరిపెట్టుకున్నది. అయితే బ్యాటర్‌గా మాత్రం కేఎల్ రాహుల్ అద్బుతమైన ప్రదర్శన చేశాడు.