రామగుండం యూరియాను తెలంగాణకు కేటాయించాలి

by Shyam |
రామగుండం యూరియాను తెలంగాణకు కేటాయించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సరిపడా కేటాయింపులు చేయాలని రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ నిర్మాణ పనులు, పురోగతి తదితర విషయాలపై గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో కర్మాగారానికి సంబంధించిన పలు విషయాలతో పాటు ఉద్యోగాల కల్పనపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఉత్పత్తి అయిన ఎరువులు అక్కడి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటే ఇతర రవాణా ఖర్చులు తగ్గే అవకాశాలున్నాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed