"చైనా నుంచి భారత్‌కు 72 వేల మంది వచ్చారు"

by vinod kumar |   ( Updated:2020-02-04 04:26:27.0  )
చైనా నుంచి భారత్‌కు 72 వేల మంది వచ్చారు
X

రోనా వైరస్ భయం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న వేళ.. చైనా నుంచి 72 వేల మంది భారత్‌కు వచ్చారన్న వార్త భారతీయులను మరింత ఆందోళనలోకి నెడుతోంది. కేంద్ర మంత్రులతో కూడా జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) బృందం కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశమై చర్చించింది. ఇందులో జి.కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చైనా వెళ్లేందుకు అవసరమైన ఈ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు జీవోఎం ప్రకటించింది. కరోనా పుట్టిన వూహాన్ పట్టణం నుంచి భారత ప్రభుత్వం 645 మందిని ఇండియాకు తరలించినట్టు తెలిపింది. వీరు కాకుండా ఈ మధ్య కాలంలో భారతీయులు 593 విమానాల్లో 72 వేల మంది భారత్ చేరుకున్నారని జీవోఎం తెలిపింది. ఇంకా భారత్ రావాల్సిన వారెవరైనా ఉంటే వారు బీజింగ్, షాంఘై, గువాంఝులోని భారత ఎంబసీల ద్వారా భారత్ చేరుకోవచ్చని జీవోఎం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed