- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్త్ ఇష్యూస్‌తో బిగ్ బాస్ హోస్ట్ చేయలేనన్న హీరో..
దిశ, సినిమా: పాపులర్ హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో తెలుగు బిగ్ బాస్ షో అతిథిగా హాజరై ఆకట్టుకున్న సుదీప్.. అక్కడ హోస్ట్‌గా అదరగొట్టేస్తున్నాడు. ఇక తన టైమింగ్, యాంకరింగ్‌కు అట్రాక్ట్ అయిపోయిన కన్నడ ప్రేక్షకులు.. సుదీప్ వీకెండ్ ఎపిసోడ్, ఎలిమినేషన్ ప్రక్రియ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్స్‌లో తాను కనిపించలేనని సుదీప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో నిరాశ చెందారు అభిమానులు.
తనకు ఆరోగ్యం బాగాలేదని తెలిపిన సుదీప్.. వీకెండ్ ఎపిసోడ్‌కు ముందే రికవర్ అవుతానని అనుకున్నప్పటికీ అలా జరగలేదన్నాడు. డాక్టర్ల సలహా ప్రకారం ఇంకాస్త రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ క్రమంలో ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌ను హోస్ట్ చేయలేనని తెలిపాడు. ఈ వీక్ ఎలిమినేషన్‌ను కోసం క్రియేటివ్ టీమ్ ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాతో వస్తుందోనని ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నానని అన్నాడు. ఈ ట్వీట్‌తో కామెంట్ సెక్షన్‌లో డిజప్పాయింట్‌మెంట్ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.