లారెన్స్, అక్షయ్ మ్యాజిక్ చేశారు : కియార

by Jakkula Samataha |
లారెన్స్, అక్షయ్ మ్యాజిక్ చేశారు : కియార
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం బాలీవుడ్‌లో చార్మింగ్ లేడీ కియారా అద్వానీ టైమ్ నడుస్తోంది. టాలెంట్‌తో పాటు లక్ కలిసి రావడం.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోవడం.. తనను లాంచ్ చేసిన హీరో అక్షయ్ కుమార్‌‌తోనే కలిసి నటించడం ఐదేళ్లలోనే జరిగిపోయింది.

2014లో కిలాడి అక్షయ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్‌లో ‘ఫగ్లీ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి లాంచ్ అయిన కియార.. 2019లో ‘గుడ్ న్యూజ్’ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘లక్ష్మి’ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కొట్టేసింది. కాగా ఈ విషయం గురించి ప్రశ్నించగా.. ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపింది కియార. గుడ్ న్యూజ్ సినిమా టైమ్‌లో అంతగా ఓపెన్ అవ్వలేకపోయానన్న భామ.. అక్షయ్ సర్‌తో కలిసి పనిచేసేటపుడు కొద్దిగా భయపడ్డానంది. సెట్‌లో తనను నిశ్శబ్దంగా గమనిస్తూ.. తను చెప్పే సూచనలు వినేదాన్నని తెలిపింది. ఒక సీన్‌కు లైఫ్ ఇచ్చేందుకు ఆయన పడే తపన.. సన్నివేశాన్ని మెరుగుపరిచే విధానం స్ఫూర్తినిస్తుందని చెప్పింది. కానీ లక్ష్మి సినిమాకు వచ్చే సమయానికి పూర్తిగా ఓపెన్ అయిపోయానని.. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యానని.. ఈ జర్నీ అమేజింగ్‌గా ఉందని తెలిపింది. త్వరలో ఓటీటీలో రిలీజ్ కానున్న ‘లక్ష్మి’ సినిమా కాంచనకు రీమేక్ కాగా, ఆ సినిమా పూర్తిగా చూడలేదు కానీ.. డైరెక్టర్ రాఘవ లారెన్స్‌తో కలిసి కొన్ని సీన్స్ మాత్రం చూశానని తెలిపింది. తమిళ్ వెర్షన్‌లో రాఘవ నటించిన విధానం చాలా నచ్చిందని, తనే హిందీ వెర్షన్ డైరెక్ట్ చేసి మ్యాజిక్ చేయగలిగాడని తెలిపింది కియార.

Advertisement

Next Story