ఫెయిల్యూర్స్ నన్ను డిసైడ్ చేయలేవు : కియారా అద్వానీ

by Jakkula Samataha |
ఫెయిల్యూర్స్ నన్ను డిసైడ్ చేయలేవు : కియారా అద్వానీ
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కియారా అద్వానీ తన బాలీవుడ్ జర్నీ గురించి ఓపెన్ అయింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లతో ఎలాంటి అచీవ్‌మెంట్స్ సాధించాలని అనుకుంటుందో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఏడేళ్ల సినీ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్స్, డిజాస్టర్స్ చూసిన కియార.. ఒక యాక్టర్‌ను సక్సెస్, ఫెయిల్యూర్స్ డిఫైన్ చేయకూడదని కోరుకుంటున్నానని చెప్పింది. ప్రతీ మూవీలోనూ మంచి పర్‌‌ఫార్మర్‌గా గుర్తించబడటమే తన లక్ష్యమని తెలిపింది.

2016లో ‘ఫగ్లీ’ చిత్రం ద్వారా సినీఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ‘కబీర్ సింగ్, లస్ట్ స్టోరీస్’ లాంటి ఇన్‌క్రెడిబుల్ ఆపర్చునిటీస్ ఒకేసారి రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ప్రేక్షకులు నటీనటుల పనిని ప్రేమిస్తే వారి నుంచి మరో అద్భుత చిత్రాన్ని ఆశిస్తారని, ఆ సమయంలో నటులపై అధిక ఒత్తిడి ఉంటుందని చెప్పింది. చివరగా ‘ఇందూ కీ జవానీ’ చిత్రంతో ఆకట్టుకున్న కియార.. ‘షేర్షా, భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story