మత సామరస్యానికి ప్రతీక.. గణేషుడి లడ్డును కైవసం చేసుకున్న ఖాదర్​జిలాని

by Shyam |   ( Updated:2021-09-19 08:17:49.0  )
మత సామరస్యానికి ప్రతీక.. గణేషుడి లడ్డును కైవసం చేసుకున్న ఖాదర్​జిలాని
X

దిశ, చార్మినార్​: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుల లడ్డూలను నిమజ్జనోత్సవాలలో భాగంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం వేలం పాట నిర్వహించారు. పాతబస్తీలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన వేలం పాటల్లో లడ్డూలు వేలల్లో, లక్షల్లో ధర పలికింది. అలియాబాద్ ​శ్రీ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో పాతబస్తీ అలియాబాద్​కు చెందిన లక్ష్మారెడ్డి రూ.1.35 లక్షలకు సొంతం చేసుకున్నారు.

అలాగే మేకల్​బండలో దేవ్​యూత్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో పోసాని సుధాకర్​ రూ.1.10లక్షలకు కైవసం చేసుకున్నారు. కందికల్​గేట్ వీరహనుమాన్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ఛత్రినాక ఇన్​స్పెక్టర్​సయ్యద్​అబ్దుల్​ఖాదర్​జిలాని రూ.5,100లకు సొంతం చేసుకోవడం విశేషం. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో రూ. 1.76లక్షలకు లడ్డూను కమిటీ సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed