- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేజీఎఫ్ – 2 విడుదల వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్… కన్నడ సినీ పరిశ్రమ రికార్డులను షేక్ చేసింది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లోనూ డబ్ అయిన ఈ సినిమా… హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది. కేజీఎఫ్ సినిమాకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండగా కేజీఎఫ్ 2 చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 23న దసరా కానుకగా సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత విజయ్ కిరగందూర్.
ఈ ప్రకటనతో కాస్త నిరాశపడిన యష్ ఫ్యాన్స్ … #KGFChapter2 హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రాఖీ భాయ్ మేము సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం .. చాలా ఆలస్యం చేస్తున్నారు అని చెబుతున్నారు. అయితే ముందుగా సమ్మర్‌లోనే సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరుగుతుండడంతో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్‌లు కూడా జరగాల్సి ఉందని తెలుస్తోంది. సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా… బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Tags: KGFChapter2, KGF 2, Yash, Prashanth Neel, Vijay Kiragandur