ఎంపీ రఘురామ అనర్హతపై లోక్‌సభ స్పీకర్ కీలక ప్రకటన

by Shamantha N |
Speaker
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ స్పందించారు. రఘురామపై అనర్హత వేటు వేయాలా వద్దా అనేది నిర్ణయించేందుకు ఓ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పీకర్ తెలిపారు. ఫిర్యాదు పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు.

ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపైనా స్పందించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలని ఓం బిర్లా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed