ఇంగ్లాండ్ వేదికలపై కెవిన్ పీటర్సన్ సంచలన కామెంట్

by Shyam |
Kevin-Peterson,-WTC
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కేవలం భారత్, న్యూజీలాండ్ దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా మ్యాచ్ ప్రారంభమైన నాటినుంచి ఏమాత్రం ఆనందం లేకుండా.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడునా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడుతుండటంతో ఆసక్తి పోయి.. నిరాశ చెందుతున్నారు. నిరంతరాయంగా వరుణుడు మ్యాచ్‌కు అడ్డం పడుతుండటంతో పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేశకులు ఐసీసీపై విమర్శలు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు తెలుసుకోకుండా.. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా WTC ఫైనల్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. దీనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భవిష్యత్తులో జరుగబోయే అతిముఖ్యమైన మ్యాచ్‌లకు వేదికగా ఇంగ్లాండ్‌ను ఎంపిక చేయొద్దని అభిప్రాయపడ్డారు. ఇక్కడ వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచే దానికి ఉదాహరణ అని వెల్లడించాడు. ఇకనుంచి ఇలాంటి ముఖ్యమైన, ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంచి స్టేడియం, శిక్షణ, అనుకూల వాతావరణం ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed