- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కిటెక్స్.. భారీగా ఉద్యోగ అవకాశాలు
దిశ, శంకర్‌పల్లి: కేరళకు చెందిన ప్రసిద్ధ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ రంగారెడ్డి జిల్లా చందనవెళ్లి పారిశ్రామిక పార్కులో, వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కులో టెక్స్‌టైల్ కంపెనీ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అందులో భాగంగానే నగరంలోని హోటల్ తాజ్ కృష్ణలో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ కిటెక్స్ కంపెనీ ఎండీ షాపు జాకబ్‌లతో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రూ.2400 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు జరిగితే 22వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి.
దుస్తుల తయారీ కంపెనీకి అవసరమయ్యే ముడిసరుకు కోసం మూడు లక్షల ఎకరాల్లో పండే పత్తిపంటను కిటెక్స్ సంస్థ కొనుగోలు చేయడంతో పత్తి పండించే రైతులకు కూడా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు మలబార్ గోల్డ్ సంస్థ కూడా భారీ పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సంస్థ ఏర్పాటు చేయడం సంతోషదాయకం అని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, చల్లా ధర్మారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అధికారులు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.