ఇప్పుడే సమర్థించలేం, వ్యతిరేకించలేం !

by Shamantha N |
ఇప్పుడే సమర్థించలేం, వ్యతిరేకించలేం !
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో చోటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చేనెల 1నుంచి జరిగే నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేరళ సీఎం స్పందించారు. నీట్, జేఈఈ 2020 పరీక్షల నిర్వహణపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా కేంద్రంతో ఏ చర్చా చేయలేదని సీఎం పినరయి విజయన్ అన్నారు. అందుకే ఇప్పుడు సమర్థించడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయబోమని ప్రకటించారు. మరోవైపు నీట్, జేఈఈ నిర్వహణపై స్టూడెంట్స్ సుముఖంగా ఉన్నారని, లక్షల మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో పరీక్షలతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed