- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ కస్టడీకి కీసర తహసీల్దార్ నాగరాజు
దిశ, క్రైమ్‌బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజు, మరో ముగ్గురు నిందితులను మూడ్రోజుల కస్టడీకీ ఏసీబీ కోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఏసీబీ వేసిన కస్టడీ పిటిషన్‌పై సోమవారం తీర్పును ప్రకటించింది. కీసర మండలం రాంపల్లి దయారా భూ వ్యవహారంలో రియల్టర్లు శ్రీనాథ్, అంజిరెడ్డి నుంచి రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని రియల్టర్లు శ్రీనాథ్, అంజిరెడ్డితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వీఆర్ఏ సాయితేజ్‌ను అరెస్టు చేశారు. రాంపల్లి దయారా గ్రామంలో 19 ఎకరాల 39గుంటల భూమికి సంబంధించి పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు తహసీల్దార్.. రియల్టర్లతో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకొని, ముందస్తుగా రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటుండగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈనెల 14న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కోర్టులో రిమాండ్ చేశారు.
ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను మరింత విచారించాలని కోరుతూ నాలుగు రోజుల కస్టడీ కావాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. తహసీల్దార్ నాగరాజుతో సహా మరో ముగ్గురిని మూడ్రోజులు ఏసీబీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో ఈ నెల 25నుంచి 27వరకూ ఈ కేసులోని నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు.