- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్‌కు కీరవాణి స్వరాలు..
డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌కు ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ ట్వీట్ సృష్టించిన రికార్డులే ప్రభాస్ స్టామినాను తెలియజేస్తున్నాయి. అలాంటి హీరో సినిమా అంటే దర్శక, నిర్మాతలు ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభాస్ 21వ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు.
నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని వైజయంతి మూవీస్.. పాన్ వరల్డ్ లెవల్‌లో నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న విషయంలోనూ కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం అందించేందుకు స్వరాల వాణి కీరవాణిని ఎంచుకున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమాకు కీరవాణి అందించిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ కాగా.. తనే సంగీతం అందించాలని కోరాట నాగ్ అశ్విన్. ఇందుకు కీరవాణి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. బాహుబలి తర్వాత ప్రభాస్, కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ఇదే.