జీతాల కోత పెట్టిన సీఎం కేసీఆర్

by Shyam |   ( Updated:2020-03-30 10:19:00.0  )
జీతాల కోత పెట్టిన సీఎం కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నంత పని చేశారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ప్యూన్ వరకు అందరి జీతాల్లో కోత పెట్టారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి చేపట్టిన లాక్ డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వివిధ రకాల ఉద్యోగులకు వేతనాల కోత విధిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

– ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.
– ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తారు.
– మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.
– నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు.
– అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధిస్తారు.
– నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధిస్తారు.
– అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.

Tags : kcr, employees salaries, telangana

Advertisement

Next Story

Most Viewed