- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు: స్వామిగౌడ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై శాసన మండలి మాజీ చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయనీ…కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో చెప్పకుండా కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండి పడ్డారు. కొలువులు సాధించి తమ బిడ్డలు తమకు తిండి పెడతారని నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆశపడుతున్నారని అన్నారు.
కేసీఆర్ అవలంభిస్తున్న వైఖరితో వారి ఆశలు అడియాశలు అయ్యాయని ధ్వజమెత్తారు. హాస్టళ్లు బంద్ కావడంతో విద్యార్థులకు తిండి దొరక్కుండా పోయిందని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపూర్‌లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ప్రపంచంలో మనుషులను అన్ని విధాలుగా మోసం చేసే గొప్ప తెలివితేటలను భగవంతుడు కేసీఆర్ ఒక్కరికే ఇచ్చారని అన్నారు. ఆ తెలివిని తెలంగాణ బిడ్డల బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించాలని ఆయన సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చుతామని ఓవైసీ వ్యాఖ్యానించిన… ఏ పార్టీ స్పందించలేదని మండి పడ్డారు. ఎంపీ బండి సంజయ్ మొనగాడనీ… కాబట్టే ఆయన ఒక్కరే స్పందించారని చెప్పారు.