గీత వృత్తిదారుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట

by Shyam |
Gowds
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గీత వృత్తిదారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి సభ వాల్ పోస్టర్‌ను గురువారం ఆయన నివాసంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు. సర్వాయి పాపన్న కులాలను మతాలను ఐక్యం చేసి ప్రజాసంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.

గీతా కార్మికుల అభివృద్ధి కోసం వృత్తి పన్నును రద్దు చేశామని, ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుడికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. వీటితోపాటు హరితహారంలో భాగంగా తాటి, ఈత మొక్కలను నాటి గీత వృత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ప్రతిష్టాత్మకంగా “నీరా పాలసీ”ని ప్రవేశపెట్టి గౌడ్‌లకు ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహిస్తున్నారన్నారు.

చిక్కడపల్లిలో ఈ నెల 16న జరగనున్న సర్వాయి పాపన్న 371 జయంతి ఉత్సవ సభకు గౌడ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, వివేక్, మాజీ ఎంపీలు డా. బూర నర్సయ్య గౌడ్, మధు యాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, తదితర ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారని కమిటీ ఛైర్మన్ శ్రీ బాలగొని బాలరాజు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ వర్కింగ్ వైస్ ఛైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, కో – ఆర్డినేటర్ సింగం సత్తయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story