శేరిలింగంపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

by Shyam |   ( Updated:2021-11-01 01:27:40.0  )
BJP-Protest1
X

దిశ, శేరిలింగంపల్లి: ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వదలడం లేదంటూ బీజేవైఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి విజిత్ వర్మ, నేషనల్ కో-ఆర్డినేటర్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా బీజేవైఎం నాయకులు సోమవారం వివేకానంద నగర్ ఉషాముల్లపూడి కమాన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు.

ఈ సందర్భంగా విజిత్ వర్మ, కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా ఒక్క నోటిఫికేషన్ వేయడం లేదని మండిపడ్డారు. యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రం పక్క నియోజకవర్గంలో ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story