- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాబోయే కొద్ది రోజుల్లో కఠిన చర్యలు.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదంపై రాబోయే కొద్ది రోజుల్లోనే కఠిన చర్యలు ఉంటాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Ohm Birla) స్పష్టం చేశారు. రాజస్థాన్ (Rajasthan) లోని బుండి పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. "పహల్గామ్‌లో జరిగిన సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడిందని అన్నారు. అలాగే ఈ సంఘటన తర్వాత దేశం, ప్రపంచం అందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నారని నిరూపించారని తెలిపారు. అంతేగాక రాబోయే రోజుల్లో ఉగ్రవాదంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని సహించేది లేదని అన్నారు. ఇక ఉగ్రవాదంపై పోరుకు ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని, దాని ఫలితాలు త్వరలోనే చూస్తామని ఓం బిర్లా చెప్పారు. కాగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని దేశం మొత్తం ఖండిస్తోంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకొని ఉగ్ర మృతులకు న్యాయం చేయాలని కోరుకుంటోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఉగ్రవాదాన్ని ఇంతటితో తుడిచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా పాక్ బార్డర్ లో యుద్ద వాతావరణం తలపిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ తో భారత్ కు సిందు నదీ జలాల ఒప్పందం సహా ఒప్పందాలను సైతం రద్దు చేసింది. ఈ చర్యలతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అని భారత ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.