- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
దిశ, మెదక్ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌడిపల్లి ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధికి చెందిన యువతి (19 ) వివాహం జరిగిన ఏడాదిలోపే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయ్యే బాజా నర్సింహులు ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చగా పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. తనకేమి సంబంధం లేదని అతను మాటమార్చాడు. మోసపోయినట్లు గ్రహించిన యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు నర్సింహులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Tags: Medak,police,case file
Advertisement
Next Story