ప్రభాస్‌తో రొమాన్స్‌కు కత్రినా గ్రీన్ సిగ్నల్..?

by Shyam |   ( Updated:2021-08-03 02:06:55.0  )
ప్రభాస్‌తో రొమాన్స్‌కు కత్రినా గ్రీన్ సిగ్నల్..?
X

దిశ, సినిమా : బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ చాలాకాలం తర్వాత సౌత్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోవడంతో ఇటువైపు తిరిగి చూడలేదు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్టెప్పులేసే ఛాన్స్ రావడంతో ఇన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్’లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ కత్రినాను మీట్ అయినట్లు తెలుస్తోంది. ఎలాగూ బాలీవుడ్‌లోనూ స్పెషల్ సాంగ్స్‌ చేస్తూ ఫుల్ క్రేజ్‌లో ఉన్న క్యాట్.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ అనేసరికి వెంటనే ఓకే చెప్పిందట. ప్రస్తుతం శృతిహాసన్‌తో కలిసి ‘సలార్’ సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొంటున్న ప్రభాస్.. నెక్స్ట్ షెడ్యూల్‌లో కత్రినాతో సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

Advertisement

Next Story