- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సూపర్ హీరో’గా కత్రినా?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ ‘మల్లీశ్వరి’ సినిమాలో రాకుమారిలా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా సమయంలో కనీసం తనకు నార్మల్ డ్యాన్స్ స్టెప్స్ కూడా రావని చెప్పిన భామ..ఆ తర్వాత ‘చిక్ని చమేలి’ సాంగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేసింది. చాలా కష్టపడి ఇష్టంగా డ్యాన్స్ నేర్చుకున్న కత్రినా నటనలో కూడా చాలా పరిణితి చూపించింది. బాలీవుడ్ సూపర్ స్టార్స్‌తో మూవీలు చేసి మెప్పించింది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో జతకట్టిన సూర్యవంశి సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా..ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఫోన్ భూత్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో పెట్టింది.
ఈ రెండు సినిమాలతో పాటు ‘టైగర్ జిందా హై 3’ సినిమాలోనూ నటించాల్సి ఉంది కత్రినా. ఇన్నాళ్లు గ్లామరస్ టచ్‌తో ఎంటర్టైన్ చేసిన క్యాట్..తొలిసారి ఈ సినిమాలో సూపర్ హీరో అవతారం ఎత్తనుంది. దీంతో ప్రాజెక్ట్ కోసం చాలా ఎగ్జైట్‌గా ఉన్నా నిరాశ ఎదురవుతుందని సమాచారం. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తుంది. సూపర్ హీరో సినిమా కాబట్టి హై టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్ వినియోగించాల్సి వస్తుందని, కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులలో ఇంత భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మించేందుకు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదట. కానీ, ఈ క్యారెక్టర్ చేసేందుకు చాలా చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్న భామ..నిర్మాణ సంస్థల గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుంది.