కత్రినాకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్న విక్కీ.. ఎన్ని కోట్లో తెలుసా?

by Shyam |
కత్రినాకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్న విక్కీ.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌ డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాసుకుంటున్నారని కత్రినా ఆవేదన వ్యక్తం చేసింది. కపిల్ శర్మ షోకు గెస్ట్‌గా హాజరైన కత్రినా ఈ విధంగా కామెంట్స్ చేసింది. ‘పెళ్లి పత్రికలు పంచనేలేదు. మ్యారేజ్ డేట్ అధికారికంగా ప్రకటించనే లేదు. అయినా రాజస్థాన్‌లో వివాహం జరగనుందంటూ చెప్పుకొంటున్నారు. అంతేకాదు పెళ్లి వేడుకను మార్చే అవకాశముందన్న విషయాన్నీ పబ్లిక్ చేసేశారు. పర్సనల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ విషయాల్లో రహస్యాలేవి ఉండకూడదా?’ అంటూ ప్రశ్నించింది.

ఇక తనకు కాబోయే శ్రీమతి కత్రినాకు విక్కీ ఓ ఖరీదైన బహుమతి ఇవ్వనున్నాడని, వారిద్దరి దాంపత్య జీవితానికి బాటలు వేస్తున్నాడంటూ బాలీవుడ్ సర్కిల్స్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విక్కీ తన ప్రేయసి కత్రినాకు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తమ మ్యారేజ్ తర్వాత కలిసుండేందుకు ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే ‘జుహు’లోని రాజ్‌మహల్‌లో ఓ విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకున్నాడనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే అడ్వాన్స్‌గా రూ.1.78 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed