- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రినా పెద్ద మనసు.. డ్యాన్సర్స్‌కు హెల్ప్
బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ ఎంత అందంగా ఉంటుందో.. అంతే అందమైన మనసు కలిగి ఉందని ప్రూవ్ చేసుకుంది. కరోనా కారణంగా ఐదు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో తిండి లేక ఆకలితో బాధపడుతున్న బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్‌కు హెల్ప్ చేసింది. 100 మంది డ్యాన్సర్లకు నేరుగా ఎకౌంట్‌లోకి డబ్బులు పంపించి నిజమైన ప్రిన్సెస్ అనిపించుకుంది క్యాట్.
కాగా, ఈ డబ్బుతో డ్యాన్సర్లు సొంతంగా వ్యాపారం ప్రారంభించి జీవనోపాధి పొందుతున్నారు. కొందరు కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేస్తే, మరికొందరు టిఫిన్ సర్వీసెస్, బ్యూటీ సర్వీసెస్ ప్రారంభించారని తెలుస్తోంది. ఇంతకుముందు కేవలం రోజువారీ కూలిపై ఆధారపడి బతికే తాము.. కత్రినా కైఫ్ పుణ్యమా అని సొంతంగా బిజినెస్ ప్రారంభించామని సదరు డ్యాన్సర్స్ థాంక్స్ చెప్తున్నారు. గత ఐదు నెలలుగా ఎలాంటి ఉపాధి లేక బాధపడుతున్న తమకు ఇంత గొప్ప సాయం అందించిన కత్రినాకు రుణపడి ఉంటామని అంటున్నారు. మరింత మంది నటీనటులు.. మాలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా డ్యాన్సర్స్‌కు సహాయం చేసిన విషయం తెలిసిందే. మరో వైపు తన సహాయంతో సోనూసూద్ రియల్ హీరో అనిపించుకోగా.. అక్షయ్ కుమార్ సైతం భారీ విరాళాలు అందిస్తున్నారు.