- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టికల్ 370 కోసం పోరాడుతాం -కశ్మీర్ పార్టీలు
దిశ, వెబ్ డెస్క్ : దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి కశ్మీర్ పార్టీలు ఒక్కటయ్యాయి. ఆర్టికల్ 370, 35ఏ ల పునరుద్ధరణ కోసం పోరాటానికి ప్రతిన బూనాయి. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం, జేకే అవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు శనివారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గతేడాది ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం 370, అధికరణం 35ఏలను కేంద్రం నిర్వీర్యం చేసింది. అప్పటి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
స్థానిక పార్టీలు ఈ చర్యలను ఆమోదించబోమని అప్పుడే ప్రకటించాయి. అదే రోజున నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో పార్టీల ప్రతినిధులు సమావేశమై 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, దాని పునరుద్ధరణకు పోరాడుతామని గుప్కార్ డిక్లరేషన్‌ను ప్రకటించాయి. తాజాగా, మరోసారి గుప్కార్ డిక్లరేషన్ 2ను ప్రకటించాయి. ఎప్పటిలాగే, 370, 35ఏ అధికరణల పునరుద్ధరణకే కట్టుబడి ఉన్నట్టు వెల్లడించాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ హస్నేన్ మసూది నివాసంలో పార్టీల చీఫ్‌లు శనివారం భేటీ అయ్యారు.
అంతకుముందే తయారుచేసిన డ్రాఫ్ట్‌ను చదివి సంతకాలు పెట్టారు. ఇందులో ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మెన్ సాజద్ లోనె, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ జీఏ మిర్, సీపీఎం నేత ఎంవై తరిగామి, జేకే అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముజఫర్ షాలు సంతకం చేశారు. రాజ్యాంగం తమకు హామీనిచ్చిన ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కలిసికట్టుగా పోరాడతామని, ఎలాంటి విభజన(రాష్ట్రాన్ని యూటీలుగా విడగొట్టడాన్ని)ను తాము అంగీకరించడం లేదని పార్టీల నాయకులు పునరుద్ఘాటించారు. సాజిద్ లోనె, మెహబూబా ముఫ్తీలు ఈ భేటీని నిర్వహించిన ఫరూఖ్ అబ్దుల్లాపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు సంతోషంగా ఉన్నదని సాజిద్ లోనె పేర్కొన్నారు.