- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరూర్ వైశ్యా బ్యాంక్ నికర లాభం 45 శాతం వృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ) నికర లాభం 45 శాతం పెరిగి రూ. 105.50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 72.92 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 1,693.23 కోట్లకు పడిపోయిందని, ఇది గతేడాది తొలి త్రైమాసికంలో రూ. 1,762.37 కోట్లుగా ఉందని కేవీబీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఇక, రిటైల్ బ్యాంకింగ్ ఆదాయం రూ. 921.80 కోట్లకు పడిపోయిందని, వడ్డీ ఆదాయం రూ. 1,376.10 కోట్లకు తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. ఆస్తి నాణ్యత మెరుగుపడి స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) జూన్ 30 నాటికి 9.17 శాతం నుంచి 8.34 శాతానికి తగ్గిందని తెలిపింది. విలువ పరంగా..స్థూల ఎన్‌పీఏలు రూ. 4,510.83 కోట్ల నుంచి రూ. 4,055.66 కోట్లకు పడిపోయాయి. నికర ఎన్‌పీఏలు లేదా బ్యాంక్ లోన్లు 4.94 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. విలువ పరంగా రూ. 2,321.77 కోట్ల నుంచి రూ. 1,585.23 కోట్లకు తగ్గాయి.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయని, ఇవి కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై ప్రభావితం చూపించినట్టు బ్యాంక్ తెలిపింది. కొవిడ్-19 ప్రభావ తీవ్రత భవిష్యత్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అనిశ్చితంగా ఉండగా, రానున్న కాలంలో తగిన చర్యలు చేపట్టనున్నట్టు బ్యాంకు వెల్లడించింది. జూన్ 30 నాటికి కొవిడ్-19 కోసం మొత్తం రూ. 120.01 కోట్లను కేటాయించినట్టు, ఒక్క జూన్ త్రైమాసికంలోనే రూ. 31.21 కోట్లను అదనంగా కేటాయించినట్టు కేవీబీ పేర్కొంది.