- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లాస్టిక్‌తో అక్కడ ఇల్లు కట్టారు!
దిశ, వెబ్‌డెస్క్: ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుందని, దాని వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని తెలిసినా, వాడకం మాత్రం తగ్గించలేం. కొంతమంది పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి యూనిక్ సొల్యుషన్స్‌తో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు మెడికల్ వేస్ట్‌తో చీపర్, స్ట్రాంగర్ బ్రిక్స్ రూపొందించిన విషయం తెలిసిందే. ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కీరదోసకాయ తొక్కతో ఫుడ్ ప్యాకేజింగ్ మెటరీయల్ అభివృద్ధి చేసినట్లు తెలుసుకున్నాం. అదే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో కర్నాటకలో ఎకో ఫ్రెండ్లీ హౌజ్‌ను తాజాగా నిర్మించారు.
కర్నాటకలోని ‘ప్లాస్టిక్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్’ 1,500 కిలోల ప్లాస్టిక్ వేస్ట్‌తో ఓ అందమైన ఇంటిని నిర్మించింది. కేవలం రూ.4.5 లక్షల ఖర్చుతో మంగళూరు, పచ్చనాడిలో ఈ ఎకో ఫ్రెండ్లీ హౌజ్ నిర్మితమైంది. రీసైకిల్డ్ ప్లాస్టిక్ హౌజ్ నిర్మించే ముందు సివిల్ ఇంజినీర్లు డ్యురేబిలిటీ టెస్ట్ చేసి పరీక్షించారు. దృఢంగా, నాణ్యతా ప్రమాణాలతో ఈ ఇల్లు నిర్మించారు. చేంజ్ ఇండియా ఫౌండేషన్ ఇలాంటివే మరో 20 నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం 20 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు.
ప్లాస్టిక్ వల్ల పర్యారవరణానికి ఎంతగా నష్టం జరుగుతుందో తెలిసిందే. భూమిని, గాలిని కలుషితం చేసే ఈ ప్లాస్టిక్ వల్ల ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికీ భవిష్యత్తులో ప్రమాదమే. మన భూగోళాన్ని కాపాడుకోవాలంటే..తప్పకుండా మనం ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. లేదా ప్లాస్టిక్‌ను రిసైక్లింగ్ చేసే ఇలాంటి ప్రత్యామ్నాయాలను మరిన్ని అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్ వేస్ట్‌ను తగ్గిస్తూ కర్నాటకలో నిర్మితమవుతున్న ఇలాంటి ఇల్లు, దేశవ్యాప్తంగా చేపట్టాలని, ఇలా అయిన ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలని కోరుకుందాం.