- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రేప్ నేనేమైనా చూశానా.. నన్ను రేప్ చేస్తున్నారు.. గ్యాంగ్ రేప్ పై ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మైసూర్ యువతి గ్యాంగ్ రేప్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో నిర్భయ కేసు వెలుగుచూసినట్లు అనిపిస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ గ్యాంగ్ రేప్ పై రాజకీయ నేతలు వివాదస్పదంగా మాట్లాడడం సంచలనంగా మారింది. ఇప్పటికే కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ ఘటనపై స్పందిస్తూ యువతులకు వేరే పనే లేదా.. అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్లడం ఏంటి..? అని, ఎక్కడో గ్యాంగ్ రేప్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నన్ను రేప్ చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మరువకముందే కర్ణాటక బీజేపీ ఎంపీ సిద్దేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గ్యాంగ్ రేప్ పై మీ స్పందన ఏంటి అని అడుగగా ఆయన అసహనంగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం అందరిని షాక్ కి గురిచేసింది. గ్యాంగ్ రేప్ చేసిన సమయంలో నేనేమైనా అక్కడ ఉన్నానా..? నేనేమైనా ఆ రేప్ ను చూశానా..? ఎందుకు పదేపదే ఆ ప్రశ్న వేసి విసిగిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో వైరల్ గా మారాయి. ఒక బాధ్యతగల పదవిలో ఉండి, ప్రజలను రక్షించాల్సింది పోయి ఒక యువతి బాధను అర్థంచేసుకోకుండా ఇలా మాట్లాడం సిగ్గుగా లేదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు సైతం పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతనిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.