- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటాం
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ కుటుంబానికి ఎల్లవేళలా తాము అండగా ఉంటామని కరీనంగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌తో కలిసి వారు మాట్లాడారు. 18న షర్మిల నిర్వహించే సమ్మేళనానికి భారీగా తరలిరానున్నట్లు చెప్పారు. తన ప్రాంత సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకే షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమ్మేళనానికి భారీగా తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశాలు పూర్తయ్యాక రాష్ట్ర ప్రజల సమస్యలన్నింటినీ మీడియా దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. ఆమె వెంట షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి, కరీంనగర్‌కు చెందిన నాయకులు ఉన్నారు.
Next Story